ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబునాయుడి నివాసం వ‌ద్ద ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఆ పార్టీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించారు. వీరిలో ఎమ్మెల్యే జోగి ర‌మేష్ కూడా ఉన్నారు. ఆయ‌న చంద్ర‌బాబు నివాసం ప్ర‌ధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ వ‌ర్గాల‌మ‌ధ్య తోపులాట జ‌రిగి ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్క‌డి భారీసంఖ్య‌లో చేరుకున్న పోలీసులు ఇరువ‌ర్గాల‌ను అదుపు చేస్తున్నారు. వైసీపీ వ‌ర్గాలు చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించాయ‌ని స‌మాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీసంఖ్య‌లో ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసంవ‌ద్ద‌కు చేరుకున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితి చేయిదాట‌కుండా పోలీసులు స‌ర్దిచెబుతున్నారు. ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దుందుడుకు వైఖ‌రి కూడా ఇరుపార్టీల శ్రేణుల మ‌ధ్య ఉద్రిక్త‌లు త‌లెత్త‌డానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: