జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ శుక్ర‌వారం స‌మీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీసీఈవోలతో ఆయ‌న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఏర్పాట్ల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. 19న నిర్వహించే కౌంటింగ్‌ ఏర్పాట్ల వివ‌రాల‌న్నీ చర్చించారు. లెక్కింపుపై ఆయ‌న కొన్ని మార్గదర్శకాలు జారీచేశారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేయ‌డ‌తోపాటు కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా క‌రోనా టీకా  వేయించుకుని ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. ఈనెల 19వ తేదీన ప‌రిష‌త్ ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. లెక్కింపున‌కు కోర్టు కూడా ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ప్ర‌భుత్వ వ‌ర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అధికార వైసీపీ సునాయాసంగా అన్నిస్థానాలు గెల‌వ‌గ‌లుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దాదాపుగా అన్ని జ‌డ్పీటీసీలు, ఎంపీటీల‌ను ఆ పార్టీప‌ర‌మ‌వుతాయ‌నే అంచ‌నాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: