స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి, యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న దేవిశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ మృతి చెందారు, అయితే తమ్ముడు మరణవార్త విని షాకైన ఆయన అక్క అంటే దేవిశ్రీప్రసాద్ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మరణించడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపేసింది. రష్యన్ కమ్యూనిస్టు లీడర్ బుల్గానిన్ చనిపోయిన రోజున పుట్టడంతో దేవి శ్రీ ప్రసాద్ తాత తన చిన్న కొడుకుకు ఆ పేరు పెట్టారు, అయితే తమ్ముడి మరణవార్త విని  సీతామహాలక్ష్మి ఆకస్మికంగా మృతి చెందడంతో దేవిశ్రీప్రసాద్ అలాగే ఆయన ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయారు. దేవి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రేసులో దూసుకుపోతున్నారు, సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న 'పుష్ప' సినిమాకి సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాతో పాటు రవితేజ నటిస్తున్న 'ఖిలాడీ', చిరంజీవి- బాబీ కాంబినేషన్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: