టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలోకి వైసీపీ నేతల ఆందోళనపై ఎమ్మెల్సీ బిటెక్ రవి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే జోగి రమేష్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బిటెక్ రవి ... మంత్రి పదవుల కోసం ఏంతటి నీఛానికైనా దిగజారుతారా అని ఆయన నిలదీశారు. పరిపాలన చేత కాక ఇలా దాడులు చేయించడం సరికాదు అని మండిపడ్డారు. విమర్శలు చేస్తే దాడులకు దిగడమేమి సాంప్రదాయం అని నిలదీశారు.
 
రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేస్తున్న జగన్… అంటూ ఆయన మండిపడ్డారు. ఆంద్రప్రదేశ్ లో ఉన్నామా.. ఆప్ఘనిస్తాన్ లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసే సాంప్రదాయం దేనికి సంకేతం అని ఈ సందర్భంగా నిలదీశారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు దిగుతారా అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి కోసం జోగి రమేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: