ఆల్ ఇండియా కాంగ్రెస్ మెంబర్ బక్క జడ్సన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డ్రగ్స్ కేసులో రాజకీయ నేతల పరమేయం ఉంది అని అధికారులకు ఫిర్యాదు చేశాము అన్నారు. 2017 లోనే డ్రగ్స్ కేసు కొలిక్కి వచ్చేది అప్పట్లో కేటిఆర్ కేసును ప్రభావితం చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దిశ కేసు, సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి లాంటి ఘటనలు మద్యం గంజాయి మత్తులో జరిగాయి అని విమర్శించారు.

ఈడీ అధికారులు త్వరలోనే ఫిర్యాదు పై విచారణ చేస్తాం అని వారు తమకు రిప్లై ఇచ్చారని వివరించారు. సినీ హీరోయిన్ లతో  కేటిఆర్ కు సంబంధాలు  ఉన్నాయి అని ఫిర్యాదులో కొన్ని ఆధారాలు పెట్టాం అని తెలిపారు. ఎక్సైజ్ కేసును క్లోస్ చేసినట్టే ఈడీ కేసులో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది అని పేర్కొన్నారు. సినీ ప్రముఖులను విచారణ చేసినట్టే రాజకీయ నాయకులను విచారణ చెయ్యాలి  అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: