టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. ప్రస్తుతం హీరో తనీష్ ని విచారించారు. ఆరు గంటలుగా తనీష్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు.. పలు కీలక వివరాలను సేకరించారు. తనీష్ బ్యాంక్ ఖాతాలను , ఆడిట్ రిపోర్ట్ లను పరిశీలించారు. డ్రగ్స్ నిందితులు కెల్విన్, జిషాన్ లతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. జిషాన్ కాంటాక్ట్ లిస్ట్ లో తనీష్ పేరు ఎందుకు ఉందని ఈడీ అధికారులు నిలదీశారు.

ఎఫ్ లాంజ్ క్లబ్ లో జరిగిన ఈవెంట్స్ , పార్టీలపై తనీష్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ కొనుగోళ్లు, విదేశాల నుండి రవాణా, నగదు చెల్లింపుల పై ఆరా  తీసారు. మని ల్యాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పై సుదీర్ఘంగా తనీష్ ను విచారిస్తున్న ఈడీ... ఇతర డ్రగ్స్ పెడ్లర్ లతో ఉన్న సంబంధాలను బయటకు లాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: