ఆంధ్ర‌ప్ర‌దేశ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ కార్యాల‌యంవ‌ద్ద వాతావ‌ర‌ణం అత్యంత ఉద్రిక్తంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేతోపాటు కార్య‌క‌ర్త‌లు దాడిచేస్తే ఇంత‌వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని నిర‌సిస్తూ తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు డీజీపీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని డీజీపీ కార్యాల‌యంలోకి గౌర‌వంగా ఆహ్వానించిన పోలీసులకు తాము ఎమ్మెల్యేలుగా క‌న‌ప‌డ‌టంలేదా? అంటూ నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌శ్నించారు. దాడి జ‌ర‌గ‌డానికి 24 గంట‌ల ముందు ఎమ్మెల్యే జోగి ర‌మేష్ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌క‌టించి త‌ర్వాత‌రోజు క‌ర్ర‌లు, రాళ్లు, ఇనుప‌రాడ్ల‌తో 14 సంవ‌త్స‌రాల‌పాటు ముఖ్య‌మంత్రిగా చేసిన వ్య‌క్తి ఇంటిపైకి వ‌స్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. డీజీపీ కార్యాల‌యంలోకి పంపించాలంటూ తెదేపా నేత‌లు డిమాండ్ చేయ‌డంతో పోలీసుల‌కు, తెదేపా శ్రేణుల‌కు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: