నిర్మల్ సభలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. పలు మార్లు సభకు పరిచయం చేసిన అమిత్ షా.. ఉప ఎన్నికల్లో ఈటెలను గెలిపించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోలేని దుస్థితి లో తెలంగాణ జాతి ఉన్నది అన్నారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ లో ప్రజాస్వామ్యం లేదు,రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేయడం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్  ప్రలోభాలకు హుజురాబాద్ ఓటర్లు లొంగరు అన్నారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు  గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అని ఆయన అన్నారు.  కేసీఆర్ జేజమ్మ వచ్చినా జెపి విజయాన్ని అడ్డుకోలేరు అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సభలో బిజెపి నేతలు అందరూ ఆవేశంగా ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగం హైలెట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts