పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది.  విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఎన్నికై తనదైన శైలిలో పని చేస్తూ ముందుకు వెళుతున్న పుష్పశ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏలూరు మీదుగా విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఏలూరు ఆశ్రం ఆసుపత్రి లో చేరారు.  అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకుని పుష్పశ్రీవాణి మళ్ళీ విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.  కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల ఆమెకు అస్వస్థత ఏర్పడినట్లు గా స్కానింగ్ చేసిన వైద్యులు గుర్తించారు.  చికిత్స తీసుకున్న అనంతరం ఆమె విశాఖపట్నం మళ్లీ బయలుదేరి వెళ్లారు.  విశాఖపట్నంలో ఆమె చికిత్స తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఇటీవలే ఆమె పండంటి ఆడపిల్లకు కూడా జన్మనిచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: