అమరావతి : గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన గంగవరం పోర్ట్ అమ్మకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక ప్రకటన జారీ చేసింది,  గంగవరం పోర్టు అమ్మకానికి సంబంధించిన గెట్ ని అధికారికంగా కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. డీవీఎస్‌ రాజు వాటా, విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వాటాలతో పాటు ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూపునకు విక్రయిస్తున్నట్లు గెజిట్ లో పేర్కొన్నారు. అమ్మకానికి ఆమోదముద్ర వేస్తూ శుక్రవారం గెజిట్‌ విడుదల విడుదల చేశారు, ఈ దెబ్బతో గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరం చేసినట్లయింది. ప్రైవేట్‌ వాటాలతోపాటు సర్కారు వాటా కూడా అమ్మేసినట్టయింది. ఒక్కో షేరు 120 చొప్పున రూ. 645 కోట్లకు విక్రయించినట్టు చెబుతున్నారు, కేబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుని గెజిట్‌ జారీ చేసినట్టు చెబుతున్నారు. మరి దీని మీద ప్రతిపక్షం ఏమని స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: