దేశంలోని ప్ర‌జ‌లంతా నిన్న అత్యంత ఉత్కంఠ‌గా సాయంత్రం వ‌ర‌కు ఎదురుచూశారు. తీరా ఏదో సామెత‌ను గుర్తుకు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. ల‌క్నోలో జీఎస్టీ మండ‌లి స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. కొవిడ్ వ‌ల్ల రెండు సంవ‌త్స‌రాలుగా వ‌ర్చువ‌ల్‌గానే జ‌రుగుతోన్న స‌మావేశం నిన్న మాత్రం య‌థావిధిగానే జ‌రిగింది. ఈ స‌మావేశంలో పెట్రో ఉత్ప‌త్తుల‌ను మండ‌లి ప‌రిధిలోకి తెస్తార‌ని, లీట‌రు పెట్రోలు రూ.57కు చేరుకుంటుందంటూ వార్త‌లు ముమ్మ‌రంగా వ‌చ్చాయి. కానీ అటువంటిదేమీ లేద‌ని, ఇంకా స‌మ‌యం ప‌డుతుందంటూ ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తేల్చేశారు. ప్ర‌స్తుతం స‌గానికి స‌గం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గాయంటే అది ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ప్ర‌యోజ‌న‌కారిగా ఉండాలి. అంతేకానీ స‌మ‌యం కాని స‌మ‌యంలో ఎవ‌రైనా, ఏ ప్ర‌భుత్వ‌మైనా ఎందుకు త‌గ్గిస్తుంది? అలా ఆశించ‌డం ప్ర‌జ‌ల పిచ్చికానీ, ప్ర‌భుత్వం పిచ్చిదికాదుక‌దా!. జీఎస్టీ ప‌రిధిలోకి తేవ‌డంవ‌ల్ల రాష్ట్రాల‌కు ఆదాయం పోతోంద‌ని, ఆయా రాష్ట్రాలు అభ్యంత‌రం చెబుతున్నాయంటూ నిర్మ‌ల చెప్పారు. కేంద్రం క‌నుక ఒకసారి జీఎస్టీ ప‌రిధిలోకి తేవాలంటే రాష్ట్రాల‌తో ఎందుకు? ఎన్నిసార్లు ఎన్ని నిర్ణ‌యాలు తీసుకోలా?  ఇక్క‌డ ఒక‌టే స్ప‌ష్ట‌మ‌వుతోంది.. వారు తేవాల‌నుకుంటే తెస్తారు.. లేదంటే తీసుకురారు.. అంతే.!

మరింత సమాచారం తెలుసుకోండి:

gst