హైదరాబాద్ లో నిమజ్జనం నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అలెర్ట్ అయింది. భక్తులకు అలాగే సామాన్య ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టింది దీనిపై హైదరాబాద్  అడిషనల్ సీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విగ్రహాలు నిమజ్జనం చేయాలి  అని ఆయన స్పష్టం చేసారు. పెద్ద విగ్రహాలు అయితే 8 నుండి 10 మంది అనుమతి  ఉంటుందన్నారు.

చిన్న విగ్రహాలు అయితే 3 నుండి 5 మందికి మాత్రమే అనుమతి ఇస్తాం  అని వివరించారు. అనవసరంగా రోడ్లు పై ఎవరు కూడా వాహనాలు పార్క్ చేయకూడదు  అని స్పష్టం చేసారు. సోమవారం ఉదయం 5.30 లోపు పూర్తిగా నిమజ్జనం కార్యక్రమం అయ్యేలా చూడాలని టార్గెట్ పెట్టుకున్నాం అని ఆయన పేర్కొన్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ కట్టడి చేసే చర్యలు తీసుకుంటాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: