శనివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామాకు ఆయన సిద్దమై రాజీనామా లేఖను సమర్పించారు. కాసేపటి క్రితం ఆయన గవర్నర్ ను కలిసారు. గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఐదు గంటలకు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం  జరుగుతుంది. ఈ సమావేశంలో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త సిఎం ను ఎన్నుకునే అవకాశం ఉండవచ్చు. ఇప్పటికే చండీఘర్ చేరుకున్న పార్టీ ఇంఛార్జి హరీశ్ రావత్, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్,  హరీశ్ చౌదరి పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ పరిస్థితి అలాగే ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్టానానికి పంపించే అవకాశం ఉంది. రేపు కొత్త సిఎం ప్రమాణ స్వీకారం ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: