శంషాబాద్ ముచ్చింత‌ల్‌లోని చిన‌జీయ‌రుస్వామి ఆశ్ర‌మంలో రామానుజాచార్యుల‌వారి 216 అడుగుల స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పంచ‌లోహాల‌తో దీన్ని త‌యారుచేయిస్తున్నారు. 200 ఎక‌రాల్లో వెయ్యికోట్ల‌రూపాయ‌ల‌తో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఫిబ్ర‌వ‌రి రెండోతేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు 35 హోమ‌గుండాల‌తో యాగాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందుకు రెండు ల‌క్ష‌ల కిలోల ఆవునెయ్యిని వినియోగిస్తున్నారు. విశిష్టాద్వైతాన్నిప్ర‌తిపాదించిన అంత‌టి మ‌హోన్న‌త వ్య‌క్తికి ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌ప‌డం నిజంగానే అద్భుతం. కానీ ఇంత ఖ‌ర్చు చేస్తున్నారంటేనే మ‌న‌సులో కొంత బాధ‌గా ఉంటోందంటున్నారు సామాజిక‌వేత్త‌లు. రామానుజాచార్యుల‌వారే నిజంగా జీవించివుంటే ఇంత‌టి భారీ కార్య‌క్ర‌మానికి ఒప్పుకునేవారు కారంటున్నారు. 35 హోమ‌గుండాల‌ కోసం రెండు ల‌క్ష‌ల కిలోల ఆవునెయ్యి అంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో ఊహించుకోండి. అంత‌టి ఖ‌ర్చును ఎంతోమంది నిరుపేద‌ల‌కు ఆహార కొర‌త రాకుండా చేయ‌వ‌చ్చ‌ని, ఆక‌లిలో అల‌మ‌టించే మూగ‌జీవాల‌కు కూడా ఆహారాన్ని జీవిత‌కాలం అందించేలా ఏర్పాటు చేసుకోవ‌చ్చంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: