తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌ని ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక‌టి కేసీఆర్ అనుకూల వ‌ర్గంకాగా, రెండోది కేసీఆర్ వ్య‌తిరేక‌వ‌ర్గ‌మ‌ని చెప్పారు. అమిత్ షా నిర్మ‌ల్ స‌భ‌కు వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ అవినీతి చిట్టాను బండి సంజ‌య్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. స‌భ‌లో బీజేపీ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసింద‌ని విమ‌ర్శించారు. గ‌జ్వేల్లో కాంగ్రెస్ స‌భ విజ‌య‌వంత‌మైందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ సొంత డ‌బ్బును ఖ‌ర్చుచేసుకొని సభ‌ల‌కు వ‌స్తున్నార‌ని కొనియాడారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఊహించిన‌దానికంటే ఎక్కుమంది గ‌జ్వేల్ స‌భ‌కు వ‌చ్చార‌ని, పెరుగుతున్న జ‌నాద‌ర‌ణ‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అలాగే రేవంత్ మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డిక వైట్‌ఛాలెంజ్ విసిరారు. ఉస్మానియాకు వెళ్లి డ్ర‌గ్స్ న‌మూనాను ఇద్దామ‌న్నారు. మంత్రి కేటీఆర్ డ్ర‌గ్స్ కేసుపై ఎందుకు స్పందించ‌ర‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈడీకి అబ్కారీశాఖ వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp