ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అలాగే కొందరు విధిస్తున్న ఆంక్షలు విమర్శలకు దారి తీస్తున్నాయి. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటం తో వాళ్లకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. మీడియా విషయంలో సహా పలు విషయాల్లో ఆంక్షలు వివాదాస్పదం అవుతున్నాయి. నేడు ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోం మంత్రి నియోజకవర్గం లో మీడియా పై ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.

పత్తిపాడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాకు అనుమతి నిరాకరణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పాస్ ఇచ్చిన అనుమతి లేదని పోలీసులు అలాగే రెవిన్యూ సిబ్బంది చెప్పడం పట్ల విమర్శలు వస్తున్నాయి. సమాచార శాఖ సిబ్బంది కూడా అక్కడ కనపడటం లేదని మీడియా వర్గాలు అంటున్నాయి. అధికారుల వ్యవహార శైలీపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap