చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం మొదలయింది. చిత్తూరు జిల్లాలో 65 జడ్పిటిసి స్థానాలకు గాను 30 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందగా ,ముప్పై మూడు స్థానాలకు ఎన్నికలు కౌంటింగ్ జరుగుతోంది అని అధికారులు తెలిపారు. బంగారుపాళ్యం, కలకడ జడ్పిటిసి స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు ఆగిపోయినట్టు అధికారులు వెల్లడించారు.

జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాలకు గాను 433 ఏకగ్రీవం కాగా 419 జరిగిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది అని పేర్కొన్నారు. 433 ఏకగ్రీవమై స్థానాల్లో  వైఎస్ ఆర్ సిపి,410 టిడిపి 8, సిపిఐ 1,స్వతంత్రులు 14 గెలుపొందారు అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 11 కౌంటింగ్ కేంద్రాల్లో  ఏర్పాటు చేసారు. 116 మంది జెడ్పిటిసి ,1040 మంది ఎంపిటిసి అభ్యర్థులు బరిలో ఉన్నారు అని అధికారులు వివరించారు. మూడు వేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొంటున్నారు అని ప్రతి రెండు గంటలకు ఒక సారి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు అని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap