కాసేపటి క్రితం ఖైరతాబాద్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యాత్రను మొదలుపెట్టారు. కలశపూజ పూర్తిచేసి.. ట్రాలీ పై గణనాధుని ఎక్కించిన నిర్వాహకులు... చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెల్డింగ్ పనులను ఉత్సవ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా నిర్వహించారు. బడా గణేష్ ని వీడ్కోలు పలికేందుకు క్యూ కట్టారు భక్తులు.

దీనితో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. మరికాసేపట్లో సెన్సేషనల్ థియేటర్ కి మహాగణపతి విగ్రహం చేరుకుంటుంది. బోనాలతో  ఖైరతాబాద్ గణేషుడి శోభా యాత్రలో మహిళల సందడి ఎక్కువగా ఉంది. ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు... కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు చేపట్టారు. బడా గణేషుడికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్న మంత్రులు, గ్రేటర్ అధికారులు అందరూ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. నిమజ్జనం వద్ద కూడా చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts