బాలాపూర్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికింది. ఈ సారి రూ.18.90 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది. దీన్ని క‌డ‌ప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌, నాద‌ర్‌గుల్‌కు చెందిన త‌న స్నేహితుడు మ‌ర్రి శ‌శాంక్‌రెడ్డితో క‌లిసి ఈ ల‌డ్డూను ద‌క్కించుకున్నారు. క‌రోనావ‌ల్ల గ‌తేడాది వేలం పాట నిర్వ‌హించ‌లేదు. అంత‌కుముందు ఏడాది జ‌రిగిన వేలంపాట‌లో కొల‌ను రాంరెడ్డి రూ.17.60 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్నారు. తాజాగా జ‌రిగిన వేలంపాట‌కు ఆయ‌న కూడా హాజ‌ర‌య్యారు. 2019లో ఈ వేలంపాట‌ జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. బాలాపూర్ వినాయ‌కుడి ల‌డ్డూకు వేలంపాటు 1994 నుంచి నిర్వ‌హిస్తున్నారు. వేలంపాట పాడుకున్న‌వారు స్థానికులైతే త‌ర్వాతి సంవ‌త్స‌రంలో డ‌బ్బులు చెల్లించ‌వ‌చ్చు. అదే స్థానికేత‌రులైతే వెంట‌నే డ‌బ్బు చెల్లించాల‌నే నిబంధ‌న ఉంది. బాలాపూర్ ల‌డ్డూకు హైద‌రాబాద్‌లో విశిష్ట‌త ఉంది. దీన్ని ద‌క్కించుకోవ‌డానికి రాజ‌కీయ నేత‌ల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ పోటీప‌డుతుంటారు. ఇది పాడుకున్న‌వారికి త‌ర్వాత అదృష్టం క‌లిసివ‌స్తుంద‌నే నానుడి ఉంది. వేలంపాట ముగియ‌డంతో మ‌రోవైపు వినాయ‌క నిమ‌జ్జ‌నాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: