ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైందన్నా సంగతి తెలిసిందే, ఈ ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రారంభం కాగా తుది ఫలితాలు వెలువడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో మెజార్టీ స్థానాలను ఆ పార్టీనే గెలుచుకుంది, నిజానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చివరి నిమిషంలో ప్రకటించింది. అయితే అప్పటికే బ్యాలెట్ పత్రాలు ముద్రించడంతో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులకు పోలయిన ఓట్లను కూడా టీడీపీ లెక్కలోనే ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీగా వైసీపీ విజయం సాధించింది, చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినా కుప్పంలో కూడా 17 ఎంపీటీసీల్లో వైసీపీ విజయం సాధించగా, 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది, కుప్పంలో వైసీపీ తమ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన 23 ఏళ్ళ హాసిని అశ్విని విజయం సాధించారు. ఆమె 1240 ఓట్లకు గాను 1143 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1989 నుండి చంద్రబాబు కంచుకోట గా ఉన్న కుప్పం లో టీడీపీ తప్ప మరో పార్టీ ఎంపీపీ కానీ జేడీపీటీసీ కానీ గెలవలేదు... ఈ సారి మాత్రం తనదైన మార్క్ రాజకీయంతో  ప్రజల మన్ననలు పొంది చంద్రబాబు కోటను బద్దలు కొట్టి చరిత్ర ను తిరగరాసినట్టే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: