ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఢిల్లీ-ముంబ‌యి ఎక్స్ ప్రెస్‌వే అందుబాటులోకి వ‌స్తే కేంద్ర ప్ర‌భుత్వానికి నెల‌కు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని కేంద్ర ర‌హ‌దారులు, ర‌వాణాశాఖ మంత్రి నితిన్‌గ‌డ్క‌రీ తెలిపారు. ఢిల్లీ నుంచి హ‌ర్యానా, రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌మీద‌గా నిర్మిత‌మ‌య్యే ఈ ర‌హ‌దారి వ‌ల్ల 24 గంట‌ల ప్ర‌యాణ స‌మ‌యం 12 గంట‌కు త‌గ్గుతుంద‌ని వెల్ల‌డించారు. నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు రాబోయే రోజుల్లో అత్య‌ధిక ఆదాయాన్ని ఈఎక్స్ ప్రెస్‌వే స‌మ‌కూర్చ‌నుంద‌ని గ‌డ్క‌రీ అభిప్రాయ‌ప‌డ్డారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో ఎన్ హెచ్ ఏఐ ఆదాయం ఏడాదికి రూ.40వేల కోట్ల నుంచి రూ.1.40 ల‌క్ష‌ల కోట్ల‌కు పెర‌గ‌బోతోంద‌న్నారు. ఎన్ హెచ్ఏఐ అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. ఈ నోడ‌ల్ ఏజెన్సీకి ఏఏఏ రేటింగ్ ఉంద‌ని, రానున్న రోజుల్లో మ‌రింత ఆదాయం దీనిద్వారా స‌మ‌కూర‌బోతోంద‌న్నారు. భార‌త్‌మాల ప్ర‌యోజ‌న్‌లో భాగంగా ఈ వే నిర్మిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. టోల్ వ‌సూలు చేయ‌డంద్వారా అత్య‌ధిక ఆదాయాన్ని ఆర్జించే మార్గంగా ఢిల్లీ-ముంబ‌యి ఎక్స్ ప్రెస్‌వే ఉండ‌బోతోంద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: