స్దానిక సంస్దల ఎన్నికలలో అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందని తెలుగుదేశం పార్టీ నేత జి.వి ఆంజనేయులు మండిపడ్డారు. ప్రత్యర్ధుల్ని బెదిరించి, కిడ్నాప్ చేశార‌ని, తప్పుడు కేసులతో వేధించారని చెప్పారు. పెడ‌న ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక జోకర్ అని, రౌడీలు గూండాలతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారంటే ఎలా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. పోలీసులు,  ముఖ్యమంత్రి ఈ దాడిని సమర్ధిస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నామా? ఆఫ్ఘన్‌లో ఉన్నామా? అనేది అర్థం కావ‌డంలేద‌న్నారు.  మఖ్యమంత్రి ఒక సైకోలా వ్యవహరిస్తున్నార‌ని, దాడి చేసిన వారిని వదిలి, తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. డీజీపీ కార్యాల‌యానికి వెళ్ళిన తమపై కేసులు పెట్ట‌డ‌మంటే దారుణ‌మ‌ని, విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి వెళితే కేసులు పెట్టే చ‌రిత్ర ఏ రాష్ట్రంలోను లేద‌న్నారు. రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ ఉంది అనుకుంటే పొర‌పాట‌ని, అది పూర్తిగా నిర్వీర్య‌మైంద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap