గ‌డిచిన 20 సంవ‌త్స‌రాలుగా ఆఫ్గ‌నిస్తాన్‌లో భార‌త్ పెట్టిన పెట్టుబ‌డి 300 కోట్ల డాల‌ర్లు. ఈ నిధుల‌తో నీటి ప్రాజెక్టులు, డ్యామ్‌లు నిర్మించ‌డంతోపాటు వివిధ మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబ‌డి పెట్టింది. స‌ల్మా డ్యామ్‌ను కూడా భార‌త్ సొంతంగా నిర్మించింది. తాలిబ‌న్లు ఆఫ్గ‌న్‌ను ఆక్ర‌మించుకున్న నేప‌థ్యంలో అక్క‌డ పెట్టిన పెట్టుబ‌డుల‌పై తుది నిర్ణ‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీసుకుంటార‌ని కేంద్ర ర‌హ‌దారుల‌శాఖ మంత్రి నితిన్‌గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. అఫ్గాన్‌లో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని, విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌తో క‌లిసి ప్ర‌ధాన‌మంత్రి తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. దాదాపుగా ఈ వ్య‌య‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంద‌ని అంత‌ర్జాతీయ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను విశ్లేషించేవారు అంటున్నారు. రెండు ద‌శాబ్దాల్లో అక్క‌డి అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబ‌డి భార‌త్‌లో పెట్టివుంటే మౌలిక సౌక‌ర్యాలు మెరుగుప‌డ‌టంతోపాటు మ‌రిన్నిర‌హ‌దారుల నిర్మాణం జ‌రిగివుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాలిబ‌న్లు ఆఫ్గ‌న్‌ను ఆక్ర‌మించుకున్న‌త‌ర్వాత ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌ను ఆపేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: