టాలీవుడ్ యంగ్ హీరో అడ‌వి శేషు తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. అడ‌వి శేషు ఇటీవ‌ల డెంగ్యూ జ్వ‌రం భారిన ప‌డ్డారు. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స అనంత‌రం కోలుకున్న అడ‌వి శేషు స‌డెన్ గా మ‌ళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ప్లేట్ లెట్స్ ప‌డిపోవ‌డంతో అడ‌వి శేషును ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అడ‌వి శేషు ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో అడ‌వి శేషు టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

హీరోగానే కాకుండా డైరెక్ష‌న్ లోనూ అడ‌వి శేషు త‌న స్టామినా చూపించారు. ఇక అడ‌వి శేషు హీరోగా న‌టించిన మేజ‌ర్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌వ‌గా త్వ‌ర‌లో ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తో పాటు అడ‌వి శేషు నాని నిర్మాణంలో వ‌స్తున్న హిట్ 2 సినిమాలోనూ న‌టించ‌బోతున్నాడు. హిట్ సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌గా హిట్ లో అడ‌వి శేషు అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: