త్వ‌ర‌లోనే ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు వినోదం పంచుతామ‌ని ఏపీ స‌మాచార ప్ర‌సార‌శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, ధియేట‌ర్ య‌జ‌మానుల‌తో సోమ‌వారం ఆయ‌న భేటీ అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాలు చొర‌వ చూపాల‌ని చిరంజీవి కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చిరంజీవి అంటే గౌర‌వ‌మ‌ని, సోద‌ర‌భావంతో ఉంటార‌ని, ఆయ‌న కోరిక మేర‌కే ఈ స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌లెవ‌రూ ప్ర‌శ్నించే అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన ధ‌ర‌ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని, ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌ల‌ను మాత్ర‌మే ధియేట‌ర్ల‌లో అమ‌లు చేయాల‌న్నారు. ఆన్‌లైన్ ద్వారా వినోదాన్ని అందించ‌డానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై అంద‌రూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని, అన్ని వ‌ర్గాల నుంచి కూడా సానుకూల స్పంద‌న వ‌చ్చింద‌ని తెలిపారు. ఈరోజు జ‌రిగిన స‌మావేశంలో బెనిఫిట్ షోల గురించి ఎవ‌రూ ప్ర‌స్తావించ‌లేద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: