రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పుడు ఏ మలుపులు తిరుగుతుందా అనేది సర్వత్రా ఉత్కంట రేగుతుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌ కు లేఖ రాసింది నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణా ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును నిలువరించాలి ఈఎన్‌సీ కోరింది.

పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారు అని కృష్ణా నదీ యాజమాయ బోర్డ్ దృష్టికి ఈఎన్‌సీ తీసుకువెళ్ళింది. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించింది అని ఈఎన్‌సీ లేఖలో పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే తీసుకోవాలి అని ఈఎన్‌సీ కోరింది. అటు తెలంగాణా ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts