బాక్సైట్ సరఫరా లిటిగేషన్ పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఢిల్లీ వెళ్తున్నారు. రస్ అల్ ఖైమా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్న రాష్ట్ర అధికారులు... సమస్య పరిష్కారం కోసం గట్టిగా కష్టపడుతున్నారు. ఆర్బిట్రేషన్ ప్రక్రియకు లండన్ వెళ్లనుంది జి.కె.ద్వివేది నేతృత్వంలో బృందం. ఈ నెలాఖరున ఒకసారి, నవంబరులో మరోసారి లండన్ వెళ్లనున్న బృందం... అక్కడి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతుంది.

 విశాఖలోని ప్లాంటుకు బాక్సైట్ ముడిఖనిజం ఇవ్వాలని రస్ అల్ ఖైమా కోరింది.  ముడిఖనిజం ఇవ్వకుంటే పరిహారం ఇవ్వాలని ఆర్బిట్రేషన్ కు సంస్థ  వెళ్ళింది.  రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకం నిషేధించామని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రస్ అల్ ఖైమాకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న ప్రభుత్వం... రల్ అల్ ఖైమా సమస్యపై కేంద్ర సాయం కోరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి విశాఖ ప్లాంట్ కు బాక్సైట్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: