మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష స్థానానికి మంచు విష్ణు పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే అధ్య‌క్ష స్థానానికి పోటీప‌డుతున్న ప్ర‌కాష్‌రాజ్ త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించ‌డంతోపాటు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి వ్యూహ‌ర‌చ‌న‌లు ర‌చిస్తున్నారు. అధ్య‌క్షుడిగా మంచు విష్ణు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌ఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్‌, ఉపాధ్య‌క్షులుగా ప్రథ్వీరాజ్ బాలిరెడ్డి, మాదాల ర‌వి, కోశాధికారిగా శివబాలాజీ, సంయుక్త కార్య‌ద‌ర్శులుగా క‌రాటే క‌ళ్యాణి, గౌత‌మ్‌రాజు పోటీప‌డుతున్నారు. అక్టోబ‌రు ప‌దోతేదీన మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మాకు అధ్యక్ష భ‌వ‌నం నిర్మించ‌డ‌మ‌నేది ప్ర‌ధాన అంశ‌మైంది. అయితే త‌న సొంత డ‌బ్బుల‌తోనే భ‌వ‌నం నిర్మించి ఇస్తాన‌ని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. స్థానిక‌త అనే అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. ప్ర‌కాష్‌రాజ్ దీన్ని తిప్పికొట్టారు. క‌ళాకారుల‌కు భాషాభేదాలుండ‌వ‌ని, దేశం మొత్తం వారికి ఒక‌టేన‌ని స్ప‌ష్టం చేశారు. మాను అభివృద్ధి చేయ‌డం, క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డ‌మే త‌న క‌ర్త‌వ్య‌మ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa