బెజ‌వాడ నగరంలో నయా మోసాలు జ‌రుగుతున్నాయి. అత్యాశ కూడా బాధితుల కొంప ముంచుతోంది. డిఆర్‌డివోలో ఉద్యోగాలు ఇపిస్తానంటే నమ్మిన ఓ మహిళా న్యాయవాది రూ.65 లక్షలు నిందితుడి బ్యాంక్ ఖాతాలో వేశారు. తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న ఆ న్యాయవాది సైబర్ పోలీసులకు పీర్యాదు చేయ‌డంతో క‌థ మ‌లుపు తిరిగింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గట్టిగుండె విద్యాసాగర్ అనే మోసగాడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విద్యాసాగ‌ర్ చేసిన మరో రెండు మోసాలు కూడా వెలుగు చూశాయి. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్తకు విదేశాల్లో ఉండే జాతి కుక్కలు వస్తున్నాయని నమ్మించి ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో రూ. 17 లక్షలు వేయించుకున్నాడు. అలాగే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి మోసం చేసినట్లు తాజాగా వెలుగు చూసింది. దీంతో ఈ రెండు కేసులే కాకుండా ఇంకేమైనా కేసులున్నాయా?  బాధితులెవ‌రూ ఫిర్యాదు చేయ‌డానికి రాలేదా? అనే కోణంలో పోలీసులు విచారించారు. ఇప్ప‌టికే రూ.21వేల కోట్ల హెరాయిన్‌కు, విజ‌య‌వాడ‌కు సంబంధాలున్నాయ‌ని తేల‌డంతో ఉలిక్కిప‌డ్డ విజ‌య‌వాడ వాసుల‌కు ఇప్ప‌డు సైబ‌ర్ నేరాలు పెరుగుతుండ‌టం మ‌రో కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: