తిరుమ‌ల గిరుల‌పై కొలువైన ఏడుకొండ‌ల‌వాడిని ద‌ర్శించుకోవాల‌నే ఆకాంక్ష‌తో ఏడేడు ఊళ్లు దాటి వ‌చ్చే భ‌క్తుల‌కు ఇక్క‌డ నిరాశే మిగులుతోంది. క‌రోనా కార‌ణంగా ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉండ‌టం, అవి కూడా ఏ నెల‌కానెల విడుద‌ల చేస్తుండ‌టం, విడుద‌లైన ఒక‌టి, రెండుగంట‌ల్లోనే టికెట్లు అయిపోతుండ‌టంతో స్వామివారి ద‌ర్శ‌నానికి నెల‌ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్న భ‌క్తుల‌కు నిరాశే మిగులుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేరుతో సుప‌థం ద్వారా ద‌ర్శ‌నానికి పంపిస్తామ‌ని చెప్పి ద‌ళారులు మోసం చేస్తున్నారు. ఒక్కో భ‌క్తుడి నుంచి రూ.8వేలు వ‌సూలు చేయ‌డంతోపాటు వారికి వైవీ సుబ్బారెడ్డి పేరుతో ఫోన్‌కు మెసేజ్ పంపించారు. తీరా చైర్మ‌న్ కార్యాల‌యానికి వెళ్లిన త‌ర్వాత అవి న‌కిలీ మెసేజ్ అనితేల‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. 11 టికెట్ల కోసం రూ.16వేల‌కు ఈ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు పోలీసులు తేల్చారు. కొండ‌ల‌పై ద‌ళారులు చెప్పే మాట‌లు విని ఎవ‌రూ మోసానికి గురికావొద్ద‌ని తితిదే అధికారులు, పోలీసులు భ‌క్తుల‌కు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: