ఆఫ్గ‌నిస్తాన్ అంటేనే ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు ఒక భావ‌న ఏర్ప‌డింది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి దేశాన్ని కైవ‌సం చేసుకున్న తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా త‌న సైన్యాన్నిఉప‌సంహ‌రించుకోవాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం తాలిబ‌న్ల‌కు వ‌ర‌మైంది. మ‌రోవైపు ఇంత‌వ‌ర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితికానీ, ప్ర‌పంచ దేశాలుకానీ అధికారికంగా తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్నిగుర్తించ‌లేదు. కానీ ర‌ష్యా, చైనా, పాకిస్తాన్ మాత్రం వారితో అంట‌కాగేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. సంబంధాల‌ను బ‌లోపేం చేసుకోవాల‌నే యోచ‌న‌లో ఉన్నాయి. ఆఫ్గ‌న్ తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రిని, విదేశాంగ మంత్రిని ఆ దేశాల‌కు చెందిన రాయ‌బారులు క‌లిశారు. అంతేకాకుండా కాబూల్‌లో ప‌ర్య‌టించారు. చైనా విదేశాంగ‌శాఖ అధికార ప్ర‌తినిధి లిజియాన్ మాట్లాడుతూ మాన‌వ హ‌క్కులు, దేశ ఆర్థిక ప‌రిస్థితిపై వారితో చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు. ఆఫ్గ‌న్ మాజీ అధ్య‌క్షుడు హ‌మీద్ క‌ర్జాయ్‌, కీల‌క నేత అబ్దుల్లా అబ్దుల్లాతోను స‌మావేశ‌మ‌య్యారు. మ‌రోవైపు తాలిబ‌న్లు ఐక్య‌రాజ్య‌స‌మితితో త‌మ‌కు గుర్తింపునివ్వాల‌ని కోరుతూ సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం న్యూయార్క్లో జ‌రుగుతున్న స‌మావేశంలో పాల్గొనేందుకు త‌మ దేశ నూత‌న రాయ‌బారి సుహైల్ ష‌హీన్‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: