వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం కేసుకు సంబంధించి గురువారం హైకోర్టులో మ‌రోసారి విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక  విషయాలు, అంశాలు చర్చించవలసి ఉన్నందున కేసులో భౌతిక వాద‌న‌లు వినాలని చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు హైకోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కూడా ఈ త‌ర‌హా వాద‌న‌ల‌కే మొగ్గుచూపారు. అనేక రకాల అఫిడవిట్‌లు, మెమోలు, కేస్ లాస్ ఉండ‌టంతో వాదనలకు అన్ని పార్టీలు  సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం స్ప‌ష్టం చేసింది.  విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. కొవిడ్ నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్‌గా వాద‌న‌లు వింటున్న హైకోర్టులో చెన్న‌మ‌మ‌నేని ర‌మేష్ న్యాయ‌వాది భౌతిక వాద‌ల‌కు మొగ్గుచూప‌డాన్ని కోర్టు కూడా అంగీక‌రించింది. ర‌మేష్ పౌర‌స‌త్వంపై వివాదం కొన్నేళ్లుగా న‌లుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలో చేరి ప్ర‌స్తుతం వేముల‌వాడ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న ర‌మేష్ పౌర‌స‌త్వం కేసు ఇప్ప‌ట్లో తేలేది కాదంటూ వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: