ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభిచింది, చంద్ర బాబు ఇంటి పై దాడి సందర్భంగా టీడీపీ నేతలు పై మోపిన ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ఇతర సెక్షన్లు కింద నమోదైన కేసుల్లో వారికి రిలీఫ్ లభించింది. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండటంతో సీఆర్పీసీ లోని 41 ఎ సెక్షన్ను కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చ్చేసింది, నాదెళ్ల బ్రహ్మం పై నమోదైన ఈ కేసులో కూడా సి ఆర్ పి సి లోని 4 1 ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారణకు పిలిపించి పంపేందుకు అవకాశం ఉంటుందని, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లో కావటంతో అరెస్టు చేసే అవకాశం లేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు, టీడీపీ నేతల తరఫున పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డిలు వాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: