హైకోర్టులో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన తాళ్ళపాక సావిత్రమ్మ కేసుపై హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రిట్ అప్పీల్ కు వెళ్ళింది. రిట్ ఆపిల్ పరిష్కారమయ్యే వరకూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. సావిత్రమ్మ భూమి తీసుకొని పరిహారం ఇవ్వటంలో జాప్యం చేశారని,

ఐదుగురు ఐఎఎస్ అధికారులకు శిక్ష విధించింది సింగిల్ జడ్జి బెంచ్. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజినల్ బెంచిలో రిట్ పిల్ దాఖలు చేసిన ప్రభుత్వం... తమ వాదనలను సమర్ధవంతంగా వినిపించింది. కాసేపటి క్రితం వాదనలు ముగియగా... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఏపీలో ఇటీవల కొందరు ఐపిఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 12 మంది అధికారులకు హైకోర్ట్ శిక్ష లు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: