కరోనా తో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు కేంద్రం 50వేల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా కేంద్రం సాయంపై సుప్రీంకోర్టు సంత్రుప్తి వ్య‌క్తం చేసింది. ఇక దీనిపై అక్టోబర్ 4వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు ఇస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. జాతీయ విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డ‌బ్బుల‌ను అందజేస్తాయని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. 

రాష్టాలు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి క‌రోనా నిధులను విడుదల చేసేందుకు అంగీకారించాయి. ఇక త్వరలో వీటికి సంబంధించిన నియామ, నిబంధనలను విడుదల చేస్తామని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే కేంద్రం తీస‌కున్న నిర్ణ‌యం భాగుంద‌ని కానీ ఎంతో మంది చిన్నారుల‌ను క‌రోనా వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారార‌ని వారి కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌లు అందించాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: