జమ్మూ కాశ్మీర్‌ లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి, పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ఈ ఉగ్రవాదులు సరిహద్దు దాటి లోయలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. పండగల సమయం లో లోయలో విధ్వంసం సృష్టించడానికి  కుట్ర సిద్ధమవుతోంది. సైన్యాలు అప్రమత్తంగా ఉండాలని, లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-అన్సార్ మరియు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పెద్ద దాడికి సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. లోయలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబాటుకు పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలు సహాయం చేస్తున్నాయని ఈ సంస్థలకు ISI మద్దతు ఉందని అంటున్నారు. నిఘా హెచ్చరిక తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు మరియు పారా మిలటరీ బలగాలకు నిఘా పెంచాలని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: