తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి, అన్ని పార్టీల ప్రతినిధులతో జరగనున్న బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి..? ఏ అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలి?  దేని గురించి చర్చ జరపాలి అనే అంశాల మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఈ ఏడాది మార్చి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు ఆర్డినెన్సులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి ఆర్డినెన్స్ లకు సంబంధించి నిర్దిష్టంగా బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది అని అంటున్నారు. అంతే కాక కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధుకు చట్టబద్ధత కల్పించడానికి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తరహాలో ప్రత్యేకంగా చట్టం తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఇక బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే పర్యటించి తిరిగి సోమవారం ఉదయం అసెంబ్లీ సెషన్‌కు హాజరుకానున్నారని అంటున్నారు, నెలల వ్యవధిలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: