ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనార‌కం డెల్టావ‌ల్ల చిన్న‌పిల్ల‌ల‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వైద్య‌నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. దీనికి బ‌ల‌మైన ఆధారాలు కూడా ఏమీ లేవ‌ని అమెరికాకు చెందిన నిపుణులు తెలిపారు. అయితే డెల్టార‌కం ఎక్కువ‌గా వ్యాప్తిచెందే ల‌క్ష‌ణాన్ని క‌లిగివుంద‌ని, దీనివ‌ల్ల చిన్నారులు పాఠ‌శాల‌ల‌కు వెళ్లినా, బ‌య‌ట‌కు వెళ్లినా మాస్క్‌లు ధ‌రించ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు. డెల్టా వేరియంట్‌తో చిన్న‌పిల్ల‌లు, కౌమార ద‌శ‌లో ఉన్న‌వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారంటూ వ‌చ్చిన విశ్లేష‌ణ‌లు కూడా త‌ప్ప‌ని, ఇంత‌వ‌ర‌కు అవి నిరూపితం కాలేద‌న్నారు. కొవిడ్‌-19 వ‌చ్చిన త‌ర్వాత ఒక్క అమెరికాలోనే 50 ల‌క్ష‌ల మంది చిన్నారులు డెల్టా వేరియంట్ బారిన ప‌డ్డారు. చాలామంది ఆసుప‌త్రుల్లో చేరార‌ని, కొవిడ్ ప్రారంభంలో ఎంత‌మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారో అంత‌స్థాయిలోనే ఉన్న‌ప్ప‌టికీ చిన్నారుల‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌న్నారు. ఆసుప‌త్రుల్లో చేరాల్సిన అవ‌స‌రం లేక‌పోయిన‌ప్ప‌టికీ వీరు చికిత్స తీసుకున్నార‌న్నారు. డెల్టా వ‌ల్ల చిన్నారుల‌కు ఎటువంటి ముప్పు లేద‌ని అమెరికా వైద్య‌నిపుణులు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: