తెలుగుదేశం పార్టీకి, జ‌న‌సేన‌కు స‌యోధ్య కుదిరింది. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా ఆచంట మండ‌లంలో తెదేపాకు ఏడు ఎంపీటీసీలు, వైసీపీకి ఆరు ఎంపీటీసీలు, జ‌న‌సేన‌కు నాలుగు వ‌చ్చాయి. మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో తెలుగుదేశం, జన‌సేన జోడీ క‌ట్టాయి. తెలుగుదేశం పార్టీకి ఎంపీపీ ప‌ద‌వి, జ‌న‌సేన‌కు వైఎస్ ఎంపీపీ ప‌ద‌వి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డానికి వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాల‌వ‌ల్లే తెలుగుదేశం, జ‌న‌సేన మ‌ధ్య స‌యోధ్య కుదిరింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనికి ఇరుపార్టీల అధిష్టానాలు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌యోధ్య‌ను రాబోయే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోను కొన‌సాగిస్తామ‌ని ఆచంట‌కు చెందిన నాయ‌కులు అంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇరుపార్టీలు జోడీక‌ట్ట‌డంపై ఎక్క‌డా వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్ప‌టికే అధికార వైసీపీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. రోడ్ల గుంత‌లు కూడా ప‌డ్చ‌క‌పోవ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లే స్వ‌యంగా ఆ గుంత‌ల‌ను పూడ్చాల‌ని ఈనెల ఐదోతేదీన రాష్ట్ర‌వ్యాప్తంగా ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp