కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్‌గా ఉంటే అవమానాలు చేస్తున్నారని, తాను తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలోకి పోవాలనుకుంటే అడ్డుకునేదెవరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్ర‌శ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్ సభలో గీతా రెడ్డి తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గీతా రెడ్డి అంటే త‌న‌కు గౌర‌వ‌మ‌ని, కానీ గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  తాను కూడా రెండు లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో తనకూ అభిమానులు ఉన్నారని జ‌గ్గారెడ్డి అన్నారు. పార్టీ కోసం పని చేసే తనకే  అవమానాలు జరుగుతున్న‌ప్పుడు మిగ‌తావారికి ఎందుకు అవ‌మానాలు జ‌ర‌గ‌వ‌న్నారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ లేక‌పోవ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి నిబ‌ద్ధ‌త‌గా ప‌నిచేసే వ్య‌క్తిన‌ని, త‌న నిబ‌ద్ధ‌త‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌న్నారు. క‌డ‌వ‌రకు తాను కాంగ్రెస్ పార్టీకే క‌ట్టుబ‌డి ఉంటాన‌ని జ‌గ్గారెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs