ఏపీలోఅధికారంలో ఉన్నవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం మరో అడ్డగోలు అమ్మకానికి సిద్ధమైంది. హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమల మీద ఆధిపత్యాన్ని రిలయన్స్ అధినేత మఖేష్ అంబానీ చేతికి అప్పగించాలని చూస్తున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ క్రమంలోనే అంబానీ కంపెనీకి చెందిన జియో సంస్థకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దర్శనం టికెట్ల వెబ్‌సైట్‌ను అప్పగిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను తితిదే ప్ర‌ఖ్యాత టీసీఎస్ సంస్థ నుంచి జియోకు అప్పగించింది.  దీనిపై ప్రశ్నిస్తే సాఫ్ట్‌వేర్ లోపాలతోనే జియోకు ఇచ్చినట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే జియోకు  తిరుమల టికెట్ల బాధ్యతలు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలున్నాయని అంటున్నారు. ఎప్పుడు అప్ప‌గించార‌నే విష‌యంలో వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్ట‌త‌నివ్వ‌డంలేదు. ఈరోజు ఉద‌యం కూడా టికెట్ల ర‌ద్దీతో వెబ్‌సైట్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతుండ‌టంతో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు కూడా నిలిపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: