డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు ఈ కేసుకి సంబంధించిన నిందితులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ. కోర్టులు విచారణకు స్వీకరించినా సరే నిందితులు మాత్రం హాజరు కావడం లేదు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం అయ్యాడు. 2020 నుంచి కోర్టుకు హాజరుకాని కెల్విన్ పై కోర్ట్ కూడా చాలా సార్లు సీరియస్ అయింది.

ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులిచ్చినా కోర్టుకు కెల్విన్ హాజరు కాకపోవడం పట్ల కోర్ట్ సీరియస్ గా ఉంది. 2018 నుంచి కోర్టుకు రాని అబూబకర్ పై పోలీసులు కూడా కన్నేశారు. ముషీరాబాద్ ఎక్సైజ్ కేసులో సోహెల్ పరారీలో ఉన్నాడు. విదేశాలకు మైక్ కమింగా అనే నిందితుడు పారిపోయాడు. నిందితులు హాజరు కాకపోవడంతో ఈ కేసు విచారణ ముందుకు వెళ్ళడం లేదు. నిందితులపై నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయినా సరే పోలీసులు పట్టుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: