రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్‌ పాటిల్‌ ధన్వే మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్‌ బెడ్‌రూమ్, దళిత ముఖ్యమంత్రి నియామకం అమలు కాలేదని విమర్శనాస్త్రాలు గుప్పించారు. దళితులకు కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదని, టీఆర్ఎస్‌ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని కేసీఆర్‌ సర్కారు ఆరోపిస్తోందని మండిపడ్డారు. ముందుగా ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఆదేశాలతోనే తాను ఇక్కడికి వచ్చానని చెప్పిన రావూ సాహేబ్‌ పాటిల్‌ ధన్వే.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: