భారతీయులకు ఇటలీ శుభ‌వార్త చెప్పింది. కొవిషీల్డ్ టీకాకు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని ఇటలీలోని ఇండియన్ ఎంబసీ  వెల్లడించింది. భారత ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మండవియా తాజాగా ఇటలీ ఆరోగ్య‌శాఖ మంత్రితో సమావేశమైనట్లు అక్క‌డి ప్ర‌భుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొవిషీల్డ్ అంశం చర్చకు వ‌చ్చింది. చ‌ర్చ‌ల అనంత‌రం ఇటలీ ప్రభుత్వం కొవిషీల్డ్‌ను గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొవిషీల్డ్ టీకా పొందిన భారతీయులు.. ఇటలీలో గ్రీన్ పాస్‌లు తీసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇటలీ ప్రభుత్వం మ‌హ‌మ్మారిని కట్టడి చేయడానికి కఠిన చర్యలను తీసుకుంటోంది. టీకా తీసుకున్న ప్రజలకు మాత్రమే గ్రీన్ పాస్‌లను అందిస్తోంది. రెస్టారెంట్‌లు, బార్లు, కేఫ్‌లు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తోంది. టీకా తీసుకోనివారిని అనుమ‌తించ‌డంలేదు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కూడా ఉపాధ్యాయులు, ఇత‌ర సిబ్బంది టీకా వేయించుకున్న‌ట్లు ధ్రువ‌ప‌త్రాన్ని చూపించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: