స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు విడ‌దల‌య్యాక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వినూత్న పోక‌డ‌లు రాజిల్లుతున్నాయి. వెలుగు చూస్తున్నాయి.ఎన్న‌డూ లేనిది రెబ‌ల్ బెల్స్ విప‌రీతంగా మోగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే (శృంగ‌ర‌వ‌ర‌పు కోట‌) క‌డుబండి శ్రీ‌నివాస‌రావు పై విప‌రీతంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. దీంతో వేపాడ మండ‌ల ఎంపీపీ ఎన్నిక అన్న‌ది ర‌సాభాస‌గా మారింది. కొత్త‌వ‌ల‌స ఎంపీటీసీలంతా  తిరుగుబాటులో ఉన్నారు. త‌మ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కోపం అవుతున్నారు. దీంతో పంచాయితీ కా స్త బొత్స ద‌గ్గ‌ర‌కు చేరుకుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుని రాజీనామా చేయమని ఏకగ్రీవ తీర్మానం చేసిన వారిలో పలువురు ఎం.పి.టి.సిలు, సర్పంచులు ఉన్నారు. మంత్రి బొత్స మాటను కూడా లెక్కచేయని తిరుగుబాటు వైసీపీ నేత‌లు ఉన్నారు. దీంతో ఏం చేయాలో తెలియ‌క బొత్స సైతం త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరం తెలియాల్సి ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఎమ్మెల్యే తీరుపై, వేపాడ మండ‌లమే కాదు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన స్థానిక ప్ర‌తినిధులూ ఆగ్ర‌హంతో ఉన్నారు. రేప‌టి వేళ వైసీపీ పై వ్య‌తిరేక‌త‌కు వీరే కార‌ణం అయినా కావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap