విజ‌య‌వాడ దుర్గగుడి ఆల‌య అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 7 నుండి 15వతేదీ వరకు దసరా ఉత్సవాలను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాకుండా మొదట్లో 30 వేల మంది బ‌క్తుల‌ను రోజుకు అనుమతిస్తున్నట్లు ప్రక‌టించారు. క‌రోనా హెచ్చరిక ల నేపధ్యంలో రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని నార్వ‌హ‌కులు తాజాగా నిర్ణయించారు. ఉచిత దర్శనం స్లాట్ బుకింగ్ లో జీరో మనీ తో లోటు పాట్లను గుర్తించారు. 

అదేవిధంగా ఉచిత దర్శనం  స్ధానంలో ఒక రూపాయి చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించారు. దేవస్థానం ద‌గ్గ‌ర‌ దర్శనం టిక్కెట్లు ఇచ్చే అంశంపై వచ్చే సమావేశం లో చర్చించభోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులను దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌ ఇరుముడుల సమర్పణకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని దేవస్థానం అధికారులు స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: