మంత్రి హ‌రీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తూ ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఈరోజు కూడా ట్ర‌బుల్ షూటర్ జ‌మ్మికుంట‌లో ప‌ర్య‌టించారు. ఈ సంధ‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ...రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పక్క జిల్లాలు, పక్క నియోజక వర్గాల నుండి వచ్చారని ఈటెల అంటున్నాడ‌ని చెప్పారు. ఈటెల భయపడి మాట్లాడుతున్నట్లు ఆర్ధం అవుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. 

హుజురాబాద్ ప్రజలను కించపరిచే విధంగా ఈటెల మాట‌లు ఉన్నాయంటూ హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. ఈటెలను చిత్తు చిత్తుగా ఓడించాలంటూ హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ మ‌రియు ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు ఏమయ్యాయంటూ హ‌రీష్ ప్ర‌శ్న‌లు కురిపించారు. గెలిస్తే కనీసం వెయ్యి కోట్ల ప్యాకేజీ అయినా బీజేపీ తీసుకు వస్తుందా అని హ‌రీష్ రావు బీజేపీ నాయ‌కుల‌ను ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: