27 వ తేదీ జరుగుతున్న భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ మద్దత్తు తెలుపుతోందని మంత్రి పేర్ని నాని స్ప‌ష్టం చేశారు. కొద్ది మాసాలుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని అనేక రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. గతంలో చేసిన చట్టాల రద్దు కొరకు రైతు సంఘాలు 27వ తేదీన‌ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిందేన‌ని అన్నారు. విశాఖ ఉక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మవద్ద‌ని చేస్తున్న భారత్ బంద్ కు ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు తెలుపుతుందని వ్యాఖ్యానించారు. 

మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులు తిరగవని పేర్ని నాని స్ప‌ష్టం చేశారు. రైతాంగానికి మ‌రియు విశాఖ ఉక్కుకు సంబంధించి పోరాటం చేస్తున్న వారు శాంతియుతంగా బంద్ నిర్వహించాల‌ని నాని పిలుపునిచ్చారు. ఒంటి గంట నుండి బస్సులు యధావిధిగా న‌డుస్తాయ‌ని పేర్ని నాని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ చేయవ‌ద్దని 3 రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుతున్నట్టు నాని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: