భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇరుదేశాల మ‌ధ్య సుహృద్భావ సంబంధాలు ఇలాగే కొన‌సాగించాల‌ని ఇరునేత‌లు కోరుకున్నారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ‌దైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దులాంటి చెత్త నిర్ణ‌యం, జీఎస్టీ లాంటి నిర్ణ‌యాల‌తోపాటు ప్ర‌యివేటుప‌రం చేస్తున్న ప్ర‌భుత్వ ఆస్తులు, ఒక‌రిద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కొమ్ముకాస్తూ అడిగిన‌వారిపైకి ఆదాయ‌పుప‌న్నుశాఖ‌ను, సీబీఐని ఉసిగొల్ప‌డంలాంటివి చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఆఫ్గ‌న్‌లో సైనిక ద‌ళాల‌ను వెన‌క్కి పిలిపించాల‌న్న నిర్ణ‌యాన్ని ట్రంప్ స‌ర్కార్ తీసుకున్న‌ప్ప‌టికీ ఆ ఫ‌లాన్ని బైడెన్ అనుభ‌విస్తున్నారు. ఒసామా బిన్‌లాడెన్ లేఖ ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. అందులో ఆయ‌న జోబైడెన్‌కు ఎటువంటి అపాయం త‌ల‌పెట్ట‌వ‌ద్ద‌ని త‌న స‌హ‌చ‌రుల‌కు సూచించారు. ఎందుకంటే బైడెన్ లాంటి అస‌మ‌ర్థ నేత‌వ‌ల్ల అమెరికాకు ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, అల్‌ఖైదాకే ఉప‌యోగ‌మంటూ ఆ లేఖ‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దీన్నిబ‌ట్టి ఇరునేత‌ల భేటీని ఇద్ద‌రు మేధావుల క‌ల‌యికా లేదంటే ఇద్ద‌రు మేతావుల క‌ల‌యికా అంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: