ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆస్తులు పెరిగాయి. ప్ర‌ధాన‌మంత్రి తాజా డిక్ల‌రేష‌న్‌లో గ‌త ఏడాది రూ.2.85 కోట్లుగా ఉన్న మోదీ సంపద రూ.3,07,68,885కి చేరింది. అంటే రూ.22 లక్షలు పెరిగాయి. మోడీ సమర్పించిన డిక్లరేషన్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆయన బ్యాంకు బ్యాలెన్సు రూ.1.5 లక్షలు, నగదు రూ.36 వేలు ఉండ‌గా, గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఎస్‌బీఐలో ఆయన చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వల్లే ఈ ఆస్తిలో పెరుగుద‌ల సంభ‌వించింది. మార్చి 31, 2021 నాటికి మోదీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.1.86 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది రూ.1.60 కోట్లు మాత్ర‌మే. స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లో రూ.8,93,251 ఉన్నాయి. జీవితబీమా పాలసీలు రూ.1,50,957 వ‌ర‌కు ఉండ‌గా, ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌లో 2012లో రూ.20 వేలు పెట్టుబడి న‌రేంద్ర‌మోడీ పెట్టారు. రూ.1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాల‌తోపాటు  మొత్తం చరాస్తి రూ.1.96 కోట్లుగా ఉంది. మోడీ పేరిట ఎలాంటి వాహనాలు లేవు. రుణాలు లేవు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మోదీ మరో ముగ్గురితో కలిసి 2002లో తాను సీఎం కావడానికి 2 నెలల ముందు ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. దానిపై రూ.2.47 లక్షల పెట్టుబడి పెట్టగా అది రూ.1.10 కోట్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: